మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఉబర్ డ్రైవర్.. స్పందించిన క్యాబ్ సంస్థ

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఉబర్ డ్రైవర్.. స్పందించిన క్యాబ్ సంస్థ

బెంగుళూరులో BTM 2వ స్టేజీ నుంచి JP నగర్ మెట్రోకి క్యాబ్ రైడ్ చేస్తుండగా ఉబర్ డ్రైవర్ తనతో ప్రవర్తించిన విధానాన్ని పేర్కొంటూ ఓ మహిళ లింక్డ్ ఇన్ లో రాసుకొచ్చింది. ఆ తర్వాత ఉబర్.. అతనిపై చర్య తీసుకోవడంతో మరో పోస్ట్ తో ఆమె అప్ డేట్ ను షేర్ చేసింది.

తనను తీసుకెళ్లేందుకు డ్రైవర్ సమయానికి వచ్చాడని, మొదట అంతా మామూలుగానే అనిపించిందని మహిళ పోస్టు ద్వారా వెల్లడించింది. అతను అకస్మాత్తుగా తెలియని మలుపు తీసుకున్నాడని, దాని గురించి మాట్లాడినప్పుడు, అతను మ్యాప్ చేసిన మార్గాన్ని అనుసరించాడని ఆమె ఆరోపించింది. ఇది ఆమెకు అసౌకర్యంగా అనిపించడంతో.. తన గమ్యస్థానానికి ముందుగానే ఆమెను త్వరగా దింపమని అతనిని అభ్యర్థించాలని నిర్ణయించుకుంది.

చివరికి ఆమె డెస్టినేషన్ ప్లేస్ రాగానే.. పేమెంట్ చేస్తున్నపుడు.. అతను తన ప్రైవేట్ పార్ట్‌లను చూపించాడని, ఆ సమయంలో ఆమె చాలా భయపడ్డానని చెప్పింది. “ఆ సమయంలో నేను వెంటనే డ్రైవర్ నుండి పారిపోయాను. సమీపంలోని గుంపుగా ఉన్న జనాల మధ్యలోకి వెళ్లి భద్రత పొందాను. షాక్, గందరగోళం మధ్య నేను ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను అని ఆమె పోస్టులో రాసుకొచ్చింది.

ఇది పోస్టు చేసిన ఓ రోజు తర్వాత మళ్లీ ఆమె ఈ పోస్టుపై అప్ డేట్ ఇచ్చింది. నాకు నిన్న జరిగిన సంఘటనకు సంబంధించిన అప్‌డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఉబర్ బృందం నా వద్దకు చేరుకుంది. ప్రమేయం ఉన్న పార్టీలోని రెండు వైపుల నుంచి అర్థం చేసుకోవడానికి ఈ విషయంపై సమగ్ర విచారణను నిర్వహించింది. వారి వేగవంతమైన ప్రతిస్పందనకు, పరిస్థితిని పరిష్కరించడానికి వారు చేసిన తీవ్రమైన ప్రయత్నాలకు నేను కృతజ్ఞురాలిని. వారు సంబంధిత డ్రైవర్‌పై అవసరమైన చర్యలు తీసుకున్నారు" అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఈ ప్లాట్‌ఫారమ్‌ను అందించినందుకు లింక్డ్‌ఇన్‌కి ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ ప్రక్రియలో తనకు లభించిన మద్దతు "అమూల్యమైనది" అని ఆమె పేర్కొన్నారు. “ఉబెర్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుందని, వారి ప్రయాణీకుల భద్రతకు తగిన చర్యలు తీసుకుందని తెలుసుకోవడం చాలా భరోసానిస్తోంది. ఇలాంటి సంఘటనలను ఎప్పటికీ సహించరాదని, కస్టమర్ శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని వారి చర్యలు రిమైండర్‌గా పనిచేస్తాయని నేను ఆశిస్తున్నాను. నిరంతర టచ్‌లో ఉన్నందుకు ఉబెర్ సంఘటన ప్రతిస్పందన బృందం సభ్యురాలు లోకేశ్వరికి కూడా ఆమె కృతజ్ఞతలు" అంటూ పోస్టుగా కొనసాగింపుగా ఆమె రాసుకొచ్చింది.