ర్యాపిడో బైక్ డ్రైవర్ చిలిపి చేష్టలు : ఐడీ సస్పెండ్ చేసిన కంపెనీ

ర్యాపిడో బైక్ డ్రైవర్ చిలిపి చేష్టలు : ఐడీ సస్పెండ్ చేసిన కంపెనీ

ర్యాపిడో.. బైక్ ట్యాక్సీ.. అలా కాల్ చేస్తే.. ఇలా వచ్చేస్తుంది బైక్.. ఈ విషయంలో కస్టమర్లు.. మగా. ఆడా అని తేడా లేదు.. పనిని బట్టి.. అవకాశాన్ని బట్టి ఇట్టే బుక్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలు, మహిళలు ర్యాపిడో బుకింగ్స్ చేస్తున్నారు.. ఈ క్రమంలోనే.. ఓ మహిళా కస్టమర్ తో అసభ్యకరంగా ప్రవర్తించిన బైక్ డ్రైవర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

ర్యాపిడో డ్రైవర్ తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఆరోపించడంతో సదరు సంస్థ అతని ఐడీని  సస్పెండ్ చేసింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. యువతి ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో   టిన్‌ ఫ్యాక్టరీ ప్రాంతం నుంచి కోరమంగళకు రాపిడో బైక్‌పై వెళ్తుండగా ర్యాపిడో డ్రైవర్ తనపై లైంగికంగా వేధించినట్లుగా తెలిపింది.  

ముందగా తన ఫోన్ లో బ్యాటరీ తక్కువగా ఉందని  చెప్పి  ర్యాపిడో డ్రైవర్ రూట్ నావిగేట్ చేయడానికి తన ఫోన్‌ కావాలని కోరాడని తెలిపింది.  ఆ తరువాత బైక్ పై వెళ్తుండగా తన పర్సనల్ విషయాలు అడిగాడిని తెలిపింది. పెట్రోల్ పంపులో తనను అనుచితంగా తనను రెండు సార్లు తాకాడని వెల్లడించింది. 

తాను చాలా కాలంగా అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ తనకు ఇలాంటి సంఘటన ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పింది. దీనిపై  మహిళ రాపిడోలో ఫిర్యాదు చేయగా.. ఈ విషయాన్ని పరిశీలించి డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని కంపెనీ వెల్లడించినట్లు.. స్పష్టం చేసింది బాధితురాలు.

అయితే  వారు రైడర్‌తో కూడా క్రాస్ వెరిఫై చేస్తారని చెప్పారని ఆమె రెడ్డిట్‌లో చెప్పింది. అనంతరం గంటలో డ్రైవర్‌ను సస్పెండ్ చేసినట్లుగా ర్యాపిడో తెలిపిందని మహిళ తెలిపింది.