జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రిగా బెంజమిన్ నెతన్యాహు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. నెస్సెట్(పార్లమెంట్)లోని 120 మంది సభ్యుల్లో 63 మంది నెతన్యాహుకు మద్దతుగా నిలిచారు. దీంతో ఆయన మిగతా పార్టీల సభ్యులతో కలిసి గవర్నమెంట్‌ను ఫామ్ చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు నెతన్యాహు మాట్లాడుతూ, దేశంలో శాంతియుత వాతావరణం తీసుకొస్తానని చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయించడంతో పాటు ఇజ్రాయెల్ సైన్యాన్ని బలోపేతం చేస్తానని చెప్పారు. దేశీయ, అంతర్జాతీయ విధానాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో యూదుల స్థావరాలను పెంచుతామని చెప్పారు.
