V6 News

జూబ్లీహిల్స్లో బెంజ్ కారు బీభత్సం..వ్యక్తికి గాయాలు.. డ్రైవర్ పరారీ

జూబ్లీహిల్స్లో బెంజ్ కారు బీభత్సం..వ్యక్తికి గాయాలు.. డ్రైవర్ పరారీ

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్​లో ఓ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం రాయదుర్గం నుంచి ఫిలింనగర్ వస్తుండగా, పద్మాలయ స్టూడియో ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొట్టి బోల్తా పడింది. ఓవర్​స్పీడ్​ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తికి గాయాలు కాగా, స్థానికులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ మరెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, రోడ్డుపై కారు బోల్తా పడటంతో సుమారు అరగంట పాటు తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించారు. ప్రమాదం అనంతరం కారు యజమాని వాహనాన్ని అక్కడే వదిలేసి పరారు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.