‘పఠాన్‌‌‌‌‌‌‌‌’ లోని ‘బేషరమ్‌‌‌‌‌‌‌‌ రంగ్‌‌‌‌‌‌‌‌’ సాంగ్ రిలీజ్

‘పఠాన్‌‌‌‌‌‌‌‌’ లోని ‘బేషరమ్‌‌‌‌‌‌‌‌ రంగ్‌‌‌‌‌‌‌‌’ సాంగ్ రిలీజ్

నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘పఠాన్‌‌‌‌‌‌‌‌’ సినిమాతో తిరిగి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు షారుఖ్‌‌‌‌‌‌‌‌ ఖాన్. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో దీపిక పదుకొణె హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. ఇందులో షారుఖ్‌‌‌‌‌‌‌‌ రా ఏజెంట్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. సోమవారం ‘బేషరమ్‌‌‌‌‌‌‌‌ రంగ్‌‌‌‌‌‌‌‌’ అంటూ సాగే రొమాంటిక్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. విశాల్, శేఖర్ సంగీతాన్ని అందించగా, శిల్పా రావు, కరాలిసా మోంటారియో పాడారు. వైభవ్ మర్చెంట్ కొరియోగ్రఫీ చేశాడు. సిక్స్‌‌‌‌‌‌‌‌ ప్యాక్‌‌‌‌‌‌‌‌తో షారుఖ్ ఇంప్రెస్ చేస్తుంటే, బికినీతో దీపిక ఫిదా చేస్తోంది. 

వీరిద్దరి ఆన్‌‌‌‌‌‌‌‌స్క్రీన్‌‌‌‌‌‌‌‌ కెమిస్ట్రీ సాంగ్‌‌‌‌‌‌‌‌కు హైలైట్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. దీంతో విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ పాట యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లో మిలియన్‌‌‌‌‌‌‌‌ వ్యూస్‌‌‌‌‌‌‌‌తో దూసుకెళుతోంది. బాలీవుడ్‌‌‌‌‌‌‌‌ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్   ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సంస్థలో వస్తోన్న 50వ చిత్రమిది. జాన్ అబ్రహాం, అశుతోష్ రానా, డింపుల్‌‌‌‌‌‌‌‌ కపాడియా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్‌‌‌‌‌‌‌‌ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ యాక్షన్‌‌‌‌‌‌‌‌ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిపబ్లిక్‌‌‌‌‌‌‌‌ డే సందర్భంగా జనవరి 25న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు.