
లంచం తీసుకుంటుండగా పట్టివేత
మహబూబ్ నగర్, వెలుగు: స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఉత్తమ సేవా అవార్డు అందుకున్న 24 గంటల్లోపే మహబూబ్ నగర్ జిల్లా లో ఏసీబీకి చిక్కా డో కానిస్టేబుల్. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం చింతలదిన్నె గ్రామానికి చెందిన కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి .. మహబూబ్ నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఐడీ పార్టీలో విధులు నిర్వహిస్తు న్నాడు.
మహబూబ్ నగర్ రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి ట్రాక్టర్ లో ఇసుకను తరలిస్తుండగా పోలీసు లు పట్టుకున్నారు. తన ట్రాక్టర్ ఎలాగైనా విడిపించాలని రమేశ్ కోరడంతో.. కానిస్టేబుల్ తిరుపతి రూ.17 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌లో తిరుపతిరెడ్డి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ కృష్ణ తెలిపారు.
తిరుపతి రెడ్డి గురువారం జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్, ఎస్పీల చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్నాడు. ఇది గడిచి 24 గంటలు కాకముందే ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశగా మారింది. ఇంతకుముందే జిల్లా కేంద్రంలోని టూటౌన్ పోలీస్టేష న్ లో డ్యూటీ చేస్తున్నప్పుడు కొందరి అండతో ఇసుక మాఫియా , ఇతర కేసుల్లో డీల్స్ చేసేవాడన్న ఆరోపణలు ఉన్నాయి.