సీతారామంకు ప్రతిష్టాత్మక అవార్డు.. IFFMలో బెస్ట్ ఫిల్మ్‌

సీతారామంకు ప్రతిష్టాత్మక అవార్డు.. IFFMలో బెస్ట్ ఫిల్మ్‌

టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపుడి(Hanu raghavapudi) దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), మృణాల్ ఠాకూరు(Mrunal thakur) జంటగా వచ్చిన క్లాసిక్ మూవీ సీతారామం(Sita Ramam). నేషనల్ క్రష్ రష్మిక మందనా(Rashmia Mandana) మరో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. ఎమోషనల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీకి 2022 ఆగస్టున విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కేవలం తెలుగులోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ లివెర్స్ ఈ సినిమాకు ఫిదా అయిపోయారు. దాదాపు రూ. 90 కోట్లు వసూళ్లు రాబ్టటిన ఈ సినిమాకు అదే రేంజ్ లో అవార్డులు కూడా వరించాయి. తాజాగా మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కించుకుంది సీతారామం మూవీ.

ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్(Indian film festivel of melborn) ఈవెంట్ మెల్‌బోర్న వేదికగా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి చాలా మంది స్టార్స్ హాజరయ్యారు. హీరో కార్తీక్ ఆర్యన్, నటి మృణాల్ ఠాకూర్, కరణ్ జోహార్, విజయ్ వర్మ తదితరులు హాజరై ప్రేక్షకులను అలరించారు. ఇందులో భాగంగా.. ఆగస్టు 11 శుక్రవారం రోజున పలు విభాగాల అవార్డులను ప్రకటించారు నిర్వాహకులు. అందులో బెస్ట్ ఫిల్మ్‌ విభాగంలో ‘సీతా రామం’ సినిమాకు అవార్డు  వరించింది. కాగా.. ఆగస్టు 20 వరకు ఈ వేడుకలు జరుగనున్నాయి.