కరెంట్ సౌకర్యం కూడా లేని మారుమూల ప్రాంతాలకు క్యాంపింగ్‌కు వెళ్లినప్పుడు, ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు గాడ్జెట్స్‌కి చార్జ్ చేసుకోవడం కష్టమవుతుంది. అలాంటప్పుడు ఈ సోలార్ పవర్ బ్యాంక్ బాగా ఉపయోగడుతుంది. దీన్ని ట్రస్ట్ బాస్కెట్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇందులోని బ్యాటరీ 20,000mAh కెపాసిటీతో వస్తుంది. దీనికి 4 సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. వాటితో బ్యాటరీ రీచార్జ్ అవుతుంది. ప్యానెల్స్‌ని ఓపెన్ చేసి బ్యాక్‌ప్యాక్ లేదా ట్రావెల్ బ్యాగ్‌కి తగిలిస్తే సరిపోతుంది.
యూఎస్‌బీ, టైప్ సీ అవుట్‌పుట్ పోర్ట్‌లతో రావడం వల్ల ఫోన్లు, టీడబ్ల్యూఎస్ బడ్స్, స్మార్ట్ వాచ్.. ఇలా అన్ని రకాల గాడ్జెట్స్‌కి సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు.. దీనికి మల్టీ ఫంక్షనల్ ఎల్‌ఈడీ ఫ్లాష్‌లైట్ కూడా ఉంటుంది. హైక్వాలిటీ ప్రీమియం పాలిమర్ బ్యాటరీని వాడారు. దీన్ని పవర్ అడాప్టర్‌తో కూడా చార్జ్ చేయొచ్చు. ఫుల్ చార్జ్ కావడానికి 5 గంటల టైం పడుతుంది.
ధర : 1999
అవుట్‌డోర్ లైట్
పవర్ సప్లై చేయడం కుదరని ప్లేస్‌ల్లో ఈ లైట్లు బాగా ఉపయోగపడతాయి. ఇవి సోలార్ పవర్‌తో వెలుగుతాయి. వీటిని వర్నిత్యా అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఎండ ఎక్కువగా ఉంటే 4–5 గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. తక్కువగా ఉంటే చార్జింగ్ టైం ఇంకాస్త పెరుగుతుంది. దీనికి స్విచ్ కూడా ఉండదు. సూర్యాస్తమయం తర్వాత దానంతటదే ఆన్ అవుతుంది. తెల్లవారుజామున ఆఫ్ అవుతుంది. వీటిని ముఖ్యంగా గార్డెన్, కాంపౌండ్ వాల్, స్టెయిర్స్, బాల్కనీ, బ్యాక్‌యార్డ్, గ్యారేజ్ లాంటి ప్రదేశాల్లో వాడుకోవచ్చు. ఈ లైట్లను ఎక్కడైనా ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. రెండు స్క్రూలను బిగిస్తే సరిపోతుంది. వర్షపు చినుకులు, మంచు పడినా తట్టుకుంటుంది. ఇది ఫుల్ చార్జ్ కావడానికి 6 నుంచి 8 గంటల టైం పడుతుంది. ధర: నాలుగింటికి రూ. 379
సోలార్ కెమెరా
నిర్మాణ స్థలాలు, పొలాలు లాంటివాటి దగ్గర కూడా అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతుంటాయి. అందుకే దొంగల భయం ఉన్న ప్లేస్‌ల్లో ఇలాంటి కెమెరాని బిగించుకుంటే సరిపోతుంది. దీన్ని యాక్టివ్ పిక్సెల్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇది సోలార్ పవర్‌తో 24/7 పనిచేస్తుంది. ప్రత్యేకంగా చార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది హై కెపాసిటీ సోలార్ ప్యానెల్, రీచార్జబుల్ బ్యాటరీతో వస్తుంది. 4ఎంపీ అల్ట్రా హెచ్‌డీ కెమెరా ఉంటుంది. నైట్ విజన్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
ఇన్‌బిల్ట్‌గా పీఐఆర్ సెన్సర్‌తో రావడం వల్ల మానవ కదలికలను గుర్తించి, వెంటనే స్మార్ట్‌ఫోన్‌కు అలెర్ట్స్ పంపుతుంది. కాకపోతే డేటా ట్రాన్స్‌ఫర్, అలర్ట్స్ కోసం ఇందులో సిమ్‌కార్డ్ వేయాల్సి ఉంటుంది. ఇది 4జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేస్తుంది. మైక్రోఫోన్, స్పీకర్ కూడా ఉంటాయి. వాటి వల్ల కెమెరా దగ్గర ఉన్నవాళ్లతో స్మార్ట్ ఫోన్‌లోని యాప్ ద్వారా మాట్లాడొచ్చు. ఇది ఐపీ 65 వాటర్‌ప్రూఫ్ డిజైన్‌తో రావడం వల్ల వర్షం, దుమ్ము, వేడిని తట్టుకోగలదు. ఎస్డీ కార్డ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.ధర: రూ. 4,499
