Good Health : ట్యాబ్లెట్ లేకుండా చిన్న చిన్న చిట్కాలతో తలనొప్పి ఇట్టే మాయం..!

Good Health : ట్యాబ్లెట్ లేకుండా చిన్న చిన్న చిట్కాలతో తలనొప్పి ఇట్టే మాయం..!

మారిన లైఫ్ స్టైల్, పెరిగిన ఒత్తిడి కారణంగా ఈరోజుల్లో తలనొప్పి చాలా కామన్ అయిపోయింది.  కాఫీ, టీ, టాబ్లెట్స్, జండూ బామ్ వంటి వాటితో తాత్కాలిక ఉపశమనం పొందినప్పటికీ శాశ్వత పరిష్కారం అందక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. తలనొప్పికి చాలా కాలం పెయిన్ కిల్లర్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. అయితే, కొన్ని టిప్స్ ఫాలో అయితే తలనొప్పిని టాబ్లెట్స్ వాడకుండానే తగ్గించుకోవచ్చు.  

  • తలనొప్పికి మన భావోద్వేగాలతో సంబంధం ఉంది. అందుకే.. తలనొప్పి మొదలవగానే ఆలోచించడం మానేసి శ్వాస మీద ధ్యాస పెట్టగలిగితే తక్షణమే ఉపశమనం పొందొచ్చు. 
  • శరీరానికి సరిపడా నీళ్లు అందకపోయినా కూడా తలనొప్పి మొదలవుతుంది. ఒక గ్లాసు చల్లటి నీళ్లు తాగితే తలనొప్పి నుండి ఉపశమనం పొందొచ్చు.
  • కొన్ని ఐస్ ముక్కలను గుడ్డలో చుట్టి తలచుట్టూ ఆడిస్తే క్షణాల్లో తలనొప్పి తగ్గిపోతుంది. లేదంటే గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కున్నా కూడా తలనొప్పి తగ్గుతుంది. 
  • ఫోర్ హెడ్, కణతల మీద మృదువుగా మర్దన చేసినా తలనొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.
  • చిన్న అల్లం ముక్క నోట్లో వేసుకుంటే తలనొప్పి మటుమాయం అవుతుంది.