ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన వైద్యం

ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన వైద్యం

ఉద్యోగి తోపాటు, భార్య పిల్లలకు మాత్రమే..
హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు మరింత మెరుగైన వైద్య సదుపాయం అందనుంది. తార్నాక హాస్పిటల్‌‌‌‌తోపాటు ప్రైవేట్, కార్పొరేట్‌‌‌‌ రిఫరల్‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేయించుకోవచ్చు. ఈ మేరకు ఆయా జిల్లాల హాస్పిటల్స్‌‌‌‌ లిస్ట్‌‌‌‌తో డిసెంబర్​ 24న ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది మంగళవారం బయటకు వచ్చింది. ఆయా హాస్పిటల్స్‌‌‌‌లో ఉద్యోగితోపాటు భార్య, పిల్లలు వైద్యం చేయించుకోచ్చు.

ఉత్తర్వుల్లో తల్లిదండ్రులను చేర్చని వైనం
‘ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా హెల్త్ సర్వీసులు అందించండి. కేవలం హైదరాబాద్‌‌‌‌లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా అవసరమైతే ప్రైవేటు హాస్పిటల్లో వైద్య సేవలు అందుకునేలా చర్యలు తీసుకోవాలి. ప్రతీ డిస్పెన్సరీలో ఉద్యోగులకు ఉచితంగా మందులు ఇయ్యాలి. మందుల కోసం బయటకు తిప్పవద్దు.’ అని డిసెంబరు 1న ప్రగతి భవన్‌‌‌‌లో ఆర్టీసీ ఉద్యోగులతో జరిగిన మీటింగ్‌‌‌‌లో కేసీఆర్‌‌‌‌ అధికారులకు సూచించారు. కానీ తాజా ఉత్తర్వుల్లో ఉద్యోగితోపాటు భార్య, పిల్లలకు మాత్రమే అని పేర్కొనడం గమనార్హం.