కాయ్ రాజా కాయ్..తెలంగాణ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్

కాయ్ రాజా కాయ్..తెలంగాణ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ దందా జరుగుతోంది.  ప్రధాన పార్టీ అభ్యర్థులు, తెలంగాణలో ఏ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందన్న దానిపై లక్షల్లో బెట్టింగ్ పెడుతున్నారు.  ఎగ్జిట్ పోల్స్ తర్వాత  బెట్టింగ్స్ భారీగా పెరిగాయి. 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.  తెలంగాణ ఎన్నికలపై ఏపీలోని పలు ప్రాంతాల్లో  నెలరోజుల నుంచి   బెట్టింగులు జరుగుతున్నాయి.  హైదరాబాద్, తెలంగాణలో బెట్టింగ్ నిర్వహిస్తే పట్టుబడే అవకాశం ఉందని గుర్తించిన బుకీలు.. ఇతర ప్రాంతాల నుంచి దందా సాగిస్తున్నట్లు సమాచారం.

ఒక పార్టీ గెలుపుపై రెట్టింపు పందేలు జరుగుతున్నాయి. లక్ష బెట్టింగ్ పెడితే అవతలి వాళ్ళు 2లక్షలు ఇచ్చేలా బెట్టింగ్స్ కాస్తున్నారు.   ఇతర దేశాలు, రాష్ట్రాల నుండి యాప్ ల ద్వారా బెట్టింగ్ పెడుతున్నారు.  రాష్ట్రంలో కీలక నేతలు  సీఎం కేసీఆర్, టీపీసీసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, బండి సంజయ్, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి మల్లరెడ్డి, పలువురు తెలంగాణ మంత్రులు పోటీ చేస్తున్న స్థానాలపై ఎక్కువగా బెట్టింగ్ జరుగుతోంది. 

 కేసీఆర్ గజ్వేల్ లో హ్యాట్రిక్ కొడతారని..కామారెడ్డిలో ఓడిపోతారని,సిద్ధిపేటలో   హరీశ్ రావు  మెజారిటీ..ఇలా ఎవరు గెలుస్తారు..ఎంత మెజారిటీ వస్తుందనేదానిపై జోరుగా బెట్టింగ్ జరుగుతోంది.   హైదరాబాద్ సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, ఏపీకి సమీపంలో ఉన్న ప్రాంతాలపై బెట్టింగ్స్ బెట్టింగ్ భారీగా జరుగుతోంది.