బాలీవుడ్ దిగ్గజ నటుడు నానా పటేకర్ హఠాన్మరణం సినీ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన నటన గురించి అందరికీ తెలుసు.. కానీ ఆయన సగభాగమైన భార్య నీలకంటి పటేకర్ అసాధారణ జీవితం గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండానే వేర్వేరుగా ఉంటూ.. ఒకరినొకరు గౌరవించుకునేవారు.
ఐఐటీ ర్యాంకర్.. కానీ కళవైపు..
పుణేలో జన్మించిన నీలకంటి చిన్నతనం నుంచే చదువులో అత్యంత ప్రతిభావంతురాలు. దేశంలోనే అత్యంత కఠినమైన ఐఐటీ ప్రవేశ పరీక్ష రాసి అద్భుతమైన ర్యాంక్ సాధించారు. ఫిజిక్స్ పూర్తి చేసిన ఆమె ముందు ఉజ్జ్వలమైన ఇంజనీరింగ్, కార్పొరేట్ కెరీర్ సిద్ధంగా ఉంది. అయితే, రూక్రేటివ్ కెరీర్‌ను పక్కనపెట్టి, తనకున్న మక్కువతో థియేటర్ వైపు అడుగులు వేశారు. నాటకరంగంలో రాణిస్తూనే ఓ బ్యాంక్ ఆఫీసర్‌గా కూడా సేవలందించారు.
రూ.750తో పెళ్లి.. ఆపై తీవ్ర విషాదం..
మరాఠీ నాటకరంగంలో పనిచేస్తున్న సమయంలోనే నానా పటేకర్, నీలకంటి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 1978లో అతి సాదాసీదాగా, కేవలం రూ. 750 ఖర్చుతో వీరు వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొత్తలోనే వీరి జీవితంలో ఊహించని తుఫాను వచ్చింది. వారి మొదటి కుమారుడు (దుర్వాస్) రెండున్నరేళ్ల చిన్న వయసులోనే అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆ తీవ్ర దుఃఖం నుండి ఒకరికొకరు తోడుగా నిలిచి కోలుకున్నారు. తరువాత వారికి మల్హర్ అనే రెండో కుమారుడు జన్మించాడు.
నటిగా, రచయిత్రిగా..
1973లోనే మహారాష్ట్ర స్టేట్ డ్రామా కాంపిటీషన్‌లో ఉత్తమ నటిగా నీలకంటి గోల్డ్ మెడల్ సాధించారు. 1989లో సచిన్ పిల్గాంకర్ 'ఆత్మవిశ్వాస్' చిత్రంలో నటనకుగాను రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. నటిగానే కాక రచయిత్రిగానూ జాతీయ అవార్డు అందుకుని తన ప్రతిభను చాటుకున్నారు.
విడిపోయినా మారని అనుబంధం..
కొన్నేళ్ల తర్వాత కొన్ని అభిప్రాయ భేదాల వల్ల ఇద్దరూ చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండానే విడిగా నివసించడం ప్రారంభించారు. మేము వేర్వేరుగా ఉంటున్నా.. ఇప్పటికీ ఒకరినొకరం గౌరవించుకుంటాం అని నానా గతంలో చెప్పారు. సుదీర్ఘ విరామం తర్వాత, ఇటీవలే విక్కీ కౌశల్ చారిత్రాత్మక చిత్రం 'ఛావా' లో 'ధరావు'పాత్రతో నీలకంటి రీ-ఎంట్రీ ఇచ్చి మళ్లీ ప్రేక్షకుల మెప్పు పొందారు..
