ఇంట్లో వాడే ఈ సామానులు, వస్తువులు క్రూడ్ ఆయిల్‌తో తయారు చేస్తారా.. ఒక్క బ్యారల్‌తో ఎన్ని వస్తాయంటే?

ఇంట్లో వాడే ఈ సామానులు, వస్తువులు క్రూడ్ ఆయిల్‌తో తయారు చేస్తారా.. ఒక్క బ్యారల్‌తో ఎన్ని వస్తాయంటే?

మీకు తెలుసా.. మన ఇంట్లో.. మనం అతి సాధారణంగా.. చాలా రెగ్యులర్ వాడే వస్తువులు చాలా వరకు క్రూడ్ ఆయిల్ తో తయారు చేస్తారని. ఎంత మందికి తెలుసు ఈ విషయం. 90 శాతం మందికి తెలియద అంట.. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ఆయిల్ కొరతతో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. క్రూడ్ ఆయిల్ తో మన ఇంట్లో వాడుకునే సామానులు, వస్తువుల లిస్ట్ చూస్తే అవాక్కవ్వటం ఖాయం. ఒక్క బ్యారల్ క్రూడ్ ఆయిల్ తో ఏం చేయొచ్చు.. ఎన్ని వస్తువులను సృష్టించవచ్చు అనేది తెలుసుకుందాం..

ఒక్క బ్యారల్ అంటే.. 159 లీటర్ల క్రూడ్ ఆయిల్
బ్యారల్ (159 లీటర్ల) క్రూడ్ ఆయిల్ తో ఏయే వస్తువులు ఎన్ని తయారు అవుతాయో చూద్దాం.

>>> బర్త్ డే క్యాండిల్స్.. అదేనండీ పుట్టిన రోజు కొవ్వొత్తులు 170 తయారు అవుతాయి.
>>> క్రెయాన్స్.. పిల్లలు రంగులు అద్దే పెన్సిల్స్.. 27 తయారు అవుతాయి.
>>> టూత్ బ్రెష్ లు.. పొద్దున్నే పళ్లు తోముకునేవి 540 తయారు చేయొచ్చు.
>>> పాకెట్ కూంబ్స్ ( జేబులో పెట్టుకునే దువ్వెనలు) 750 తయారు అవుతాయి.
>>> పాలిస్టర్ చొక్కాలు 39 తయారు అవుతాయి.
>>> ఆయిల్, రసాయనాల కొలతలను పరిశీలించే మగ్గులు 195 తయారు అవుతాయి.
>>> ప్లాస్టిక్ డస్ట్ బిన్స్.. మనం చెత్త వేసే డబ్బాలు 65 తయారు అవుతాయి.
>>> ల్యాండ్ లైన్ ఫోన్లు 11 తయారు అవుతాయి.
>>> రబ్బరు బాల్స్ 135 తయారు అవుతాయి.
>>> ప్లాస్టిక్ గ్లాసులు.. మంచి నీళ్లు తాగే ప్లాస్టిక్ గ్లాసులు 65 తయారు అవుతాయి.
>>> వ్యాయమం (ఎక్సర్ సైజ్) కోసం ఉపయోగించే రింగ్స్.. నడుముకు పెట్టుకుని తిప్పుతారే.. ఆ రింగ్స్ 23 తయారు అవుతాయి.

>>> ఇక మరీ ముఖ్యంగా ఒక్క బ్యారల్ క్రూడ్ ఆయిల్ (159 లీటర్ల)తో 70 కిలోవాట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది.
>>> బైక్స్ లో పోసే ఇంజిల్ ఆయిల్ ఒక లీటర్ వస్తుంది.
>>> తారు.. రోడ్లకు వేసే తారు 4 లీటర్లు వస్తుంది. 
>>> చిన్న గ్యాస్ సిలిండర్లు.. అదేనండీ 5 కేజీలు, 10 కేజీలు, 14 కేజీల గ్యాస్ సిలిండర్లు 12 తయారు చేయొచ్చు.
>>> charcoal briquettes.. థండూరి వంటి వంటకాలను కాల్చటం కోసం ఉపయోగించే బొగ్గు.. 2 కేజీల వరకు వస్తుంది. 

>>> మరీ ముఖ్యంగా.. ఒక్క బ్యారల్ క్రూడ్ ఆయిల్ తో.. ఓ భారీ ట్రక్కు 65 కిలోమీటర్లు ప్రయాణం చేయటానికి కావాల్సిన ఆయిల్ ఇస్తుంది. 
>>> ఓ చిన్న కారు 450 కిలోమీటర్ల ప్రయాణానికి కావాల్సిన ఆయిల్ ఇస్తుంది. 

క్రూడ్ ఆయిలే కదా అని లైట్ తీసుకోవద్దు.. ఈ లిస్ట్ జస్ట్ మనం రోజువారీ.. ఇంట్లో మన కళ్ల ముందు కనిపించే వస్తువులు తయారు అయ్యేది ఈ క్రూడ్ ఆయిల్ నుంచే అని తెలుసుకోండి. పైన చెప్పిన లిస్ట్ అంతా కేవలం ఒక్క బ్యారల్.. అంటే 159 లీటర్ల క్రూడ్ ఆయిల్ నుంచి తయారు అవుతున్నాయి. ఇవి కాకుండా పెట్రోల్, డీజిల్, విమానం ఇంధనం.. గ్యాస్.. ఇలా బోలెడు.. బోలెడు వస్తాయి.. అందుకే క్రూడ్ ఆయిల్ సంక్షోభం.. మన ఇంట్లో సంక్షోభాన్ని తీసుకొస్తుంది అనటంలో సందేహం లేదు..