రామయ్య హుండీ ఆదాయం రూ.1.62 కోట్లు

రామయ్య హుండీ ఆదాయం రూ.1.62 కోట్లు

భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. 48 రోజులకు గాను రూ.కోటి 62లక్షల 13వేల 534 నగదు వచ్చింది. వీటితో పాటు 182 గ్రాముల బంగారం, కిలో 800 గ్రాముల వెండి వచ్చాయి. 200 యుఎస్​ డాలర్లు, ఒమన్​కు చెందిన100 రియాల్స్​, 60 యూరోలు, 10 పౌండ్స్ తో పాటు బెహ్రయిన్, శ్రీలంక, యుఏఈ, ఖతార్​, కువైట్​దేశాల కరెన్సీ కూడా వచ్చింది.  ఈవో రమాదేవి పర్యవేక్షణలో హుండీలను లెక్కించారు.