భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్..అవినీతి ఆరోపణల ఫిర్యాదులతో ఏసీబీ నిఘా

భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్..అవినీతి ఆరోపణల ఫిర్యాదులతో ఏసీబీ నిఘా
  • బ్యాంక్ లావాదేవీల ఆధారంగా విచారించి అదుపులోకి..

భద్రాచలం,వెలుగు : భద్రాచలం సబ్​రిజిస్ట్రార్​షేక్​ఖదీర్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. గురువారం భద్రాచలంలోని ఐటీడీఏ ఆవరణలోని సబ్​ రిజిస్ట్రార్​ఆఫీసులో డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. గతంలో బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ గా చేసేటప్పుడు షేక్ ఖదీర్​పై తీవ్ర అవినీతి, ఆరోపణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి.

 దీంతో గతేడాది జూన్ లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేసింది. అనంతరం సబ్ రిజిస్ట్రార్ ఖదీర్ ​బ్యాంకు లావాదేవీలపై నిఘా పెట్టింది. బ్యాంకు స్టేట్​మెంట్​ఆధారంగా భారీగా మనీ ట్రాన్స్ ఫర్ అయినట్టు, కొందరు సిబ్బంది అకౌంట్ల ద్వారా కూడా నగదు వెళ్లినట్టు ఏసీబీ  గుర్తించింది. 

ప్రస్తుతం భద్రాచలం సబ్​రిజిస్ట్రార్ గా ఖదీర్​ ఉండగా.. అక్కడికి ఏసీబీ వెళ్లింది. బ్యాంకు స్టేట్ మెంట్ ద్వారా ఆయనను అదుపులోకి తీసుకుని విచారించి పూర్తి వివరాలు రాబట్టిన అనంతరం అరెస్ట్ చేసింది. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్​ చేస్తే ఏసీబీకి కంప్లయింట్ చేయాలని డీఎస్పీ వై.రమేశ్​ సూచించారు.