హైదరాబాద్, వెలుగు: భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్నిని ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇటీవల సీఎం కేసీఆర్ ను కలిసిన నేపథ్యంలో చిన్నిని సస్పెండ్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.కాగా.. త్వరలో ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నారు.