
ఏసీబీ ఎన్ని దాడులు చేస్తున్నా ఎంత మందిని అరెస్టు చేస్తున్నా అధికారుల తీరు మారటం లేదు. ఏసీబీకి దొరికితే ఉద్యోగం రిస్క్ లో పడుతుందని కూడా ఆలోచించకుండా టేబుల్ కింద చేయి పెడుతూనే ఉన్నారు. సోమవారం ( ఆగస్టు 25న) కొత్తగూడెం వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నర్సింహారావు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికారు .
లక్ష్మీదేవి పల్లి మండలం బంగారు చిలక గ్రామంలోని ఫర్టిలైజర్ షాప్ యజమాని నుంచి రూ. 50 వేల లంచం డిమాండ్ చేయగా... ఇవాళ రూ.25 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. యూరియా అమ్మకాల కోసం షో కాజ్ నోటీసు ఇచ్చి దాన్ని ఉపసంహరించుకునేందుకు రూ 25 వేలు తన కార్యాలయం విద్యానగర్ లో లంచం తీసుకుంటుండగా ఏసీబీడి ఎస్పీ వై. రమేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఏసీబీ డీఎస్పీ వై రమేష్ .. కొత్తగూడెం విద్యానగర్ కాలనీలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఏడిఏ ఆఫీస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఏడీఏ U.నరసింహారావు ఫెర్టిలైజర్ షాపు యజమాని వద్ద 25 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని బంగారు చెలక గ్రామంలో యూరియా అమ్మకాలు చేస్తున్న ఫెర్టిలైజర్ షాప్ దగ్గరకు ఏడిఏ నరసింహారావు వెళ్లారు. షాపు వారిని సంబంధిత కాగితాలు తీసుకొని ఏడీఏ ఆఫీస్ కు రావలసిందిగా ఆదేశించారు. షాపు ఓనరు కాగితాలు తీసుకొని అగ్రికల్చర్ ఆఫీస్ కు రాగా మీ దగ్గర ఫార్మ్ లేదని, ఇన్ వాయిస్ ప్రాపర్ గా లేదని రూ. 50 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లంచం ఇచ్చుకోలేమని బతిమిలాడినప్పటికీ ఇవ్వక పోతే షాపు లైసెన్స్ రద్దు చేస్తామని బెదిరించడంతో షాపు ఓనర్ ఏసీబీని ఆశ్రయించాడు. షాపు ఓనర్ ని లంచం అడిగిన వాయిస్ రికార్డుతో పాటు ఈ రోజు రూ. 25000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కలర్ టెస్టింగ్ లో సైతం ఏడిఏ నరసింహారావు దొరికినట్లు తెలిపారు ఏసీబీ డీఎస్పీ వై రమేష్.
►ALSO READ | రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ ఉండదు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్