రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ ఉండదు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్

రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ ఉండదు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్

రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ ఉండదన్నారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. కరీంనగర్  కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడిన ఆయన.. పది మంది ఎమ్మెల్యే సంగతి తర్వాత ముందు  మీ కుటుంబ ఆస్తుల పంచాయితీ  తేల్చుకోవాలని కేటీఆర్ పై  సెటైర్ వేశారు.  లక్షా 20 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ వాళ్లను  దోషులుగా తేలిస్తే సుప్రీం కోర్టును ఆశ్రయించారు కానీ ప్రజా క్షేత్రంలో బీఆర్ఎస్ కు శిక్ష తప్పదని హెచ్చరించారు.   గత పదేళ్లలో తెలంగాణలో శాంపిల్ సర్కార్ నడిపించారని ఫైర్ అయ్యారు. 

సమావేశంలో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. జనహిత పాదయాత్ర వల్ల బీజేపీ, భరాస కు కడుపు నొప్పి వస్తుంది.  కార్యకర్త త్యాగ ఫలితంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రజల్లో జరుగుతున్న వాస్తవాలను తెలుసుకునేందుకే జనహిత పాదయాత్ర. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న కార్యకర్తలను వదిలిపెట్టుకోబోమన్నారు.  పేదవారి జీవిత కాల స్వప్నమైన ఇందిరమ్మ ఇండ్లను అందిస్తున్నాం. పథకాలు రాని 10 శాతం వారే ఇబ్బంది పెడుతున్నారు .దీనిపై  కార్యకర్తలు  దృష్టి పెట్టాలి.  బండి సంజయ్ వ్యాఖ్యల వల్లే బీసీ బిల్లు పెండింగ్ లో ఉంది.  దేవుడి పేరు చెప్పకుండా బండి సంజయ్ మళ్ళీ గెలుస్తారా?.అంబానీ, అదానీలకు కేంద్ర ప్రభుత్వం దోచి పెడుతుంది.  క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గలేదు?.  12 ఏళ్లలో రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది.? రాష్ట్రంలో జరిగిందంతా కాంగ్రెస్ హయంలోనే జరిగింది. 42 బీసీ రిజర్వేషన్స్ లో ముస్లింలకు 5.8 శాతం మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే 4 శాతం ఉంది. అయినా బీజేపీ 10 శాతం అని తప్పుడు ప్రచారం చేస్తోంది.  బీజేపీ ఎంపీల వల్ల బీసీ ప్రజలకు అన్యాయం జరుగుతుందని అన్నారు మహేశ్ కుమార్ గౌడ్. 

10 నెలలు పనిచేయాల్సిందే..

కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్లు 10 నెలలు  ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేయాలన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్.   కొత్తగా పార్టీలోకి వచ్చే వారికి అవకాశాలు ఉంటాయి కానీ పాత వారికి ముందు అవకాశం  వస్తుందన్నారు.  కరీంనగర్ లో కార్యకర్తల మీటింగ్లో మాట్లాడిన మీనాక్షి నటరాజన్.. ఓట్ చోరీ నీ ఆపాలంటే ఓటర్ లిస్ట్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు మీనాక్షి నటరాజన్ . ఎన్నికల సంఘం బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా పని చేస్తోందని ఆరోపించారు మీనాక్షి నటరాజన్.  కార్యకర్తల మనోభావాలు తెలుసుకునేందుకే అందరితో మాట్లాడామని చెప్పారు. 

►ALSO READ | కొత్తగా చేరిన వాళ్లు .. 10 నెలలు పార్టీ కోసం పనిచేయాల్సిందే : మీనాక్షి నటరాజన్