
కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్లు 10 నెలలు ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేయాలన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్. కొత్తగా పార్టీలోకి వచ్చే వారికి అవకాశాలు ఉంటాయి కానీ పాత వారికి ముందు అవకాశం వస్తుందన్నారు.
కరీంనగర్ లో కార్యకర్తల మీటింగ్లో మాట్లాడిన మీనాక్షి నటరాజన్.. ఓట్ చోరీ నీ ఆపాలంటే ఓటర్ లిస్ట్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు .ఎన్నికల సంఘం బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా పని చేస్తోందని ఆరోపించారు మీనాక్షి నటరాజన్. కార్యకర్తల మనోభావాలు తెలుసుకునేందుకే అందరితో మాట్లాడామని చెప్పారు.
►ALSO READ | ఓయూకి మళ్లీ వస్తా.. ఆర్ట్స్ కాలేజ్లో మీటింగ్ పెడతా: సీఎం రేవంత్ రెడ్డి
పార్టీలోని అన్ని విభాగాలు కలిసి జనహిత పాదయాత్రను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తలిపారు మీనాక్షి నటరాజన్ . అధికారంలో ఉన్నా ఎందుకు పాదయాత్ర చేస్తున్నారని కొందరు అడిగారు. అధికారంలోకి వచ్చాక కూడా ప్రజలకు ఇచ్చిన హామీల అమలును క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు పాదయాత్ర అవసరమని చెప్పారు. ప్రజలకు మేలు జరిగే విధంగా కాంగ్రెస్ హయంలో అనేక చట్టాలు చేహామని చెప్పారు. NCRT పుస్తకాల్లో అనేక చరిత్ర పాఠాలను మార్చారు. అయినా ఎర్ర కోట మీద నుంచే ఇప్పటికీ జెండా ఎగురవేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో పేదల కోసం అనేక పథకాలు చేపడుతున్నారు. ఇవి సోనియా గాంధీ గ్యారంటీలు. ఇవి 5 ఏళ్ల కోసం ఇచ్చినవని.. వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తామని తెలిపారు.