ఖమ్మం జిల్లాలో గంజాయి హాట్ స్పాట్స్ పై స్పెషల్ ఫోకస్ : ఎస్పీ బి.రోహిత్ రాజు

ఖమ్మం జిల్లాలో గంజాయి హాట్ స్పాట్స్ పై  స్పెషల్ ఫోకస్ : ఎస్పీ బి.రోహిత్ రాజు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలో గంజాయి హాట్​స్పాట్స్​పై పోలీసులు స్పెషల్​ ఫోకస్ పెట్టాలని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ బి.రోహిత్ రాజు పేర్కొన్నారు. హేమచంద్రాపురంలోని పోలీస్​ హెడ్ క్వార్టర్​లో శుక్రవారం నిర్వహించిన క్రైం రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. గంజాయి విక్రయించే వారితోపాటు సేవించే వారిపై నిఘా పెట్టి, కేసులు నమోదు చేయాలన్నారు. 

అనుమానితులకు గంజాయి ర్యాపిడ్​ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించి, పాజిటివ్​ వస్తే చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల్లో క్వాలిటీ ఆఫ్​ ఇన్వెస్టిగేషన్​ ద్వారా నేరస్థులకు శిక్ష పడే విధంగా పోలీసు అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు. పోలీస్​ హెడ్ క్వార్టర్స్​లో మోటార్​ ట్రాన్స్​పోర్టు వర్క్​ షాప్​లో కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రాలిక్​ వెహికల్ లిఫ్టర్​ను ఎస్పీ ప్రారంభించారు.