భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాము కల్యాణోత్సవానికి సిద్ధమవుతోంది. శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 10న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు శ్రీసీతారాముల తిరుకల్యాణోత్సవం (శ్రీరామనవమి) నిర్వహించనున్నారు. ఈ మేరకు వైదిక కమిటీ రూపొందించిన బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను ఆలయ ఈఓ బి.శివాజీ సోమవారం విడుదల చేశారు. ఏప్రిల్ 2 నుంచి 16 వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
అయితే వచ్చేనెల జరగాల్సిన శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి టికెట్ ధరల విషయంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కల్యాణం టిక్కెట్ ధరలను దేవస్థానం పెంచింది. ఉభయ దాతల టిక్కెట్ లను 5వేల రూపాయల నుంచి రూ. 7500కు.. రూ. 2000 టిక్కెట్ ధరను 2500కు పెంచింది. రూ. 1116 టిక్కెట్ ధరను రూ. 2000కు పెంచారు. రూ. 500 టిక్కెట్ ధరను రూ. 1000కు, రూ. 200 టిక్కెట్ ధరను 300 రూపాయలకు పెంచారు. ఇక రూ. 100 రూపాయల టిక్కెట్ ధరను 150 రూపాయలకు పెంచారు. పట్టాభిషేకం టిక్కెట్ ధర రూ. 250 నుండి రూ. 1000 రూపాయలు ఆలయ అధికారులు పెంచారు.
ఇవి కూడా చదవండి:
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
నన్ను బెదిరించిన జర్నలిస్టు ఎవరో చెప్పను
