
- ఈ మెషీన్ నుంచే దర్శనం, ప్రసాదం టికెట్లు
భద్రాచలం, వెలుగు: రాష్ట్రంలోనే తొలిసారిగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో భక్తులకు శనివారం నుంచి కియోస్క్ సేవలు షురూ అయ్యాయి. కౌంటర్లతో సంబంధం లేకుండా భక్తులు నేరుగా ఈ మెషీన్ నుంచే దర్శనం, ప్రసాదం, ఆర్జిత, అర్చన టిక్కెట్లు తీసుకోవచ్చు. విరాళాలు కూడా చెల్లించవచ్చని ఈవో రమాదేవి తెలిపారు. తొలిరోజు పలువురు భక్తులు ఈ సేవలను వినియోగించుకున్నారు. నిమిషాల్లోనే టిక్కెట్లు లభించడంతో వారు హ్యాపీగా ఫీలయ్యారు.
రాష్ట్రంలోని ఎండోమెంట్ ఆలయాల్లో ఈ సౌకర్యం ఉన్న టెంపుల్‌గా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం రికార్డుల్లోకి ఎక్కింది. ఫెడరల్ బ్యాంకు రూ.2 లక్షల వ్యయంతో ఈ మెషీన్‌ను అందించింది. త్వరలో మరో రెండు మెషీన్లు తెప్పించేందుకు ఈవో రమాదేవి వారితో మాట్లాడారు. డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని భక్తులకు పిలుపునిచ్చారు.