
విజయ్ ఆంటోనీ హీరోగా అరుణ్ ప్రభు రూపొందిస్తున్న చిత్రం ‘భద్రకాళి’. రామాంజనేయులు జవ్వాజీ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇందులో నటించిన హీరోయిన్స్ తృప్తి రవీంద్ర, రియాజిత్తు మాట్లాడుతూ ‘ఇదొక పొలిటికల్ ఎంటర్‌టైనర్. చాలా ఇంపాక్ట్‌ఫుల్ కథ. ఇలాంటి కథ సొసైటీకి చాలా అవసరం. ఇందులో నటించడం ఆనందంగా ఉంది. మా క్యారెక్టర్స్ అందరూ రిలేట్ చేసుకునేలా కనెక్ట్ అవుతాయి. డైరెక్టర్ అరుణ్ ప్రభు మా పాత్రను బాగా డిజైన్ చేశారు. షూటింగ్‌లో చాలా ఎంజాయ్ చేశాం. విజయ్ గారి 25వ మూవీలో భాగం అవడం చాలా సంతోషంగా ఉంది. ఆయనతో నటించడం మంచి ఎక్స్‌పీరియెన్స్. తెలుగు ఆడియెన్స్ మమ్మల్ని సపోర్ట్ చేసి గొప్పగా ఆదరిస్తారని నమ్ముతున్నాం’ అని చెప్పారు.