V6 News

వరంగల్ భద్రకాళి టెంపుల్ ఇంటి దొంగలు సస్పెన్షన్

వరంగల్ భద్రకాళి టెంపుల్ ఇంటి దొంగలు సస్పెన్షన్

వరంగల్​ సిటీ, వెలుగు : వరంగల్ భద్రకాళి ఆలయ ఇంటి దొంగలు సస్పెండ్ అయ్యారు.  కొన్నేండ్లుగా దేవాదాయ శాఖకు చెందిన ఉద్యోగులు నరేందర్, శరత్​కుమార్​ఆలయ కౌంటర్​వద్ద డూప్లికేట్​టికెట్లు భక్తులకు అమ్ముతున్నారు. వచ్చిన ఆదాయాన్ని ఇద్దరు పంచుకుంటున్నారు.  ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇంటిదొంగలపై దేవాదాయ శాఖ అసిస్టెంట్​ కమిషనర్​రామాల సునీతకు ఐదు రోజుల కింద సమాచారం అందింది.  

దీంతో ఉద్యోగులపై ఆమె ప్రత్యేక నిఘా పెట్టింది. కౌంటర్ లో డూప్లికేట్ టికెట్లు అమ్ముతుండగా ఇద్దరు ఉద్యోగులను పట్టుకుని మంగళవారం సస్పెండ్​ చేసింది. విచారణలో మరిన్ని ఆధారాలను తీసుకుని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.