భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ మండలాల్లో చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేలవాలింది. లక్ష్మీదేవిపల్లి మండలంలో 125 మంది రైతులకు చెందిన152 ఎకరాలు, పాల్వంచ మండలంలో 65 మంది రైతులకు చెందిన113 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతింది. గాలులు, వడగండ్ల వానతో పంట దెబ్బ తిని నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు. పంట నష్టంపై అగ్రికల్చర్ అధికారులు సర్వే చేపట్టగా, పంట నష్టంపై సర్వే చేపట్టి నివేదికలు ఇవ్వాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆదేశించారు. పంట నష్టంపై అసెంబ్లీలో మాట్లాడతానని తెలిపారు.
