
పోలీసులు, టీఆర్ఎస్ పార్టీ కుమ్మకై అసోం సీఎం హిమంత పై దాడి చేశారని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ఆరోపించారు. స్టేజీపై అసోం సీఎం ను మాట్లాడమని ఆహ్వానిస్తున్న సమయం లో టీఆర్ఎస్ కండువా కప్పుకున్న నందకిషోర్ అనే వ్యక్తి స్టేజీ పైకి వచ్చి మైకును లాక్కోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్మహిళా కార్యకర్తలను అస్సాం సీఎం కు నిరసనగా పిలిపించినట్టు తెలిసిందన్నారు. హిమంత బిశ్వ శర్మ గణేశ్ ఉత్సవాలు చూడటానికే వచ్చారు. ఆయన రాజకీయాలు మాట్లాడారు అనడం అధికార పార్టీ నేతల విజ్ఞతకు వదిలేస్తున్నామన్నారు. భద్రత ఇవ్వాల్సిన పోలీసులు దాడి సమయంలో లేరన్నారు. దాడి కంటే ముందు చాలా మంది పోలీసులు స్టేజీ పరిసరాల్లో ఉన్నారని చెప్పారు. పక్కా ప్లాన్ ప్రకారమే పోలీసులు స్టేజీపై నుంచి వెళ్లిపోయారన్నారు. అసోం సీఎం దాడి పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేస్తానన్నారు.