భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో.. 

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో.. 
  • దేశ భక్తి, దైవ భక్తి పెంచేలా ఉత్సవాలు

హైదరాబాద్: స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తెలిపింది. దేశ భక్తి, దైవభక్తిని పెంచేలా ఉత్సవాలు చేస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే తరాలకు భారతీయ సంస్కృతిని తెలియజేసేలా విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నామన్నారు ఉత్సవ సమితి సభ్యులు. ప్రతి ఒక్కరు గణేష్ మండపాల్లో ఇదే విధంగా ఆచరించాలని పిలుపునిచ్చారు.ఈనెల 31వ తేదీన గణేష్ చతుర్తి సందర్భంగా సంస్కృతిక కార్య్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.  

స్వాతంత్ర సమరయోధులు, అమరవీరుల త్యాగాలు, పోరాటాల వీర గాధలు, బుర్రకథలు, హరికథల ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పదనాన్ని తెలియజేసేందుకు ప్రయత్నిస్తామని వివరించారు.