నిమజ్జనం విషయంలో అధికారులకు సహకరిస్తాం

నిమజ్జనం విషయంలో అధికారులకు సహకరిస్తాం

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ) గణేష్ విగ్రహాలను కూడా హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలంటూ ఆందోళనకు దిగిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెక్రెటరీ భగవంత రావు దీక్షను విరమించారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ఆయన.. హుసేన్ సాగర్ లో ఎల్లుండి (సెప్టెంబరు 9న) గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామని అధికారుల నుంచి ప్రకటన రావడంతో దీక్షను విరమించారు. నిమజ్జనం విషయంలో ప్రభుత్వ అధికారులకు సహకరిస్తామని ఆయన వెల్లడించారు.

ప్రశాంతంగా నిమజ్జనం జరిగే విధంగా ప్రభుత్వ అధికారులు కూడా సహకరించాలని కోరారు. రేపు హుసేన్ సాగర్ కు వెళ్లి, నిమజ్జనానికి సంబంధించి చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తామని భగవంత రావు తెలిపారు. ఇది హిందువులు అందరు ఐక్యంగా నిలబడి సాధించిన విజయమన్నారు. గణేశ్ నిమజ్జనం రోజు అస్సాం ముఖ్యమంత్రి వచ్చి ప్రసంగిస్తారని భగవంత రావు వెల్లడించారు. కాగా, అంతకుముందు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆఫీస్ లో దీక్ష చేస్తున్న భగవంత రావు కు పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు.