గోల్కొండ బోనాలకు రండి

గోల్కొండ బోనాలకు రండి
  •  గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు భాగ్యనగర బోనాల ఉత్సవ సమితి ఆహ్వానం 

మెహిదీపట్నం, వెలుగు : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి చిహ్నమైన గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొనాలని రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను భాగ్యనగర బోనాల ఉత్సవ సమితి కోరింది. ఆదివారం గవర్నర్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేసింది. ఈనెల7న బోనాల ఉత్సవాలు షురూ అవుతున్నట్టు , తొలి పూజలో పాల్గొనాలని ఆహ్వానించింది.

గోల్కొండ బోనాల ఉత్సవాల ప్రాముఖ్యతను వివరించింది. గవర్నర్ ను కలిసినవారిలో భాగ్యనగర బోనాల ఉత్సవ సమితి ప్రెసిడెంట్ భగవంతరావు, జనరల్ సెక్రటరీ రాహుల్ స్వాగత్, గోల్కొండ టెంపుల్ ప్రొఫెషనల్ వర్కర్ అడ్వైజర్ రాజు వస్తాద్, గోల్కొండ వృత్తి పనివారల సంఘం అధ్యక్షుడు బొమ్మల సాయిబాబా చారి, శ్రీకాంత్ చారి, రావు యాదగిరి చారి  ఉన్నారు.