మెగా ఫ్యామిలీ వివాదంలో భైరవం మూవీ డైరెక్టర్ : అకౌంట్ హ్యాక్ అయ్యిందంటున్న విజయ్

మెగా ఫ్యామిలీ వివాదంలో భైరవం మూవీ డైరెక్టర్ : అకౌంట్ హ్యాక్ అయ్యిందంటున్న విజయ్

‘నాంది’ డైరెక్టర్ విజయ్‌‌ కనకమేడలపై సొషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం విజయ్‌‌ కనకమేడల భైరవం మూవీతో మే 30న ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ 'బాయ్‌కాట్ భైరవం' అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ క్రియేట్ చేస్తున్నారు. అసలు దర్శకుడు విజయ్ కనకమేడలకు-మెగా హీరోల మధ్య జరిగిన వివాదం ఏంటీ? మెగా ఫ్యాన్స్ ఎందుకు డైరెక్టర్ విజయ్పై సీరియస్గా ఉన్నారు? అసలు 14 ఏళ్ల కింద విజయ్ పెట్టిన పోస్ట్ ఏంటీ? పూర్తీ వివరాలు తెలుసుకుందాం. 

ఏం జరిగిందంటే?

విజయ్‌ కనకమేడల 2011లో చిరంజీవి, రామ్‌ చరణ్‌లపై ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌ పెట్టాడు. హిందీలో అమితాబ్‌, అభిషేక్‌ కలిసి నటించిన ‘పా’ మూవీ పోస్టర్‌ని మార్పింగ్‌ చేసి చిరంజీవి, రామ్‌ చరణ్‌ ముఖాలను వాటిపై అతికించారు. ఆ పోస్టర్‌కి ‘ఛా’అనే టైటిల్‌ పెట్టి.. ‘సామాజిక న్యాయం సమర్పించు ‘ఛా’అని వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్కి వచ్చింది.

గురువారం (మే 22) సాయంత్రం నుంచి ఈ ఫొటో వైరల్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ అతనిని, అతడు తీసిన సినిమాను బాయ్‌కాట్ చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ ఆగ్రహాన్ని తట్టుకోలేక క్లారిటీ ఇస్తూ X ఖాతాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు.

ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ అభిమానులకు క్షమాపణ చెప్పాడు. ఆ పోస్ట్ తాను పెట్టింది కాదని, హ్యాక్‌ అయిందని సమాధానం చెప్పుకున్నప్పటికీ.. ఫ్యాన్స్ ఏ మాత్రం తగ్గట్లేదు. సినిమా రిలీజ్ ముందు డైరెక్టర్ పెట్టుకున్న ఈ పెంటకు.. నిర్మాత బలవ్వాల్సిందే అంటూ మరికొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

హ్యాక్ చేశారంటూ పోస్ట్: 

విజయ్‌ కనకమేడల మాటల్లోనే.. "మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకు అందరికీ గుడ్ ఈవెనింగ్. మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్ జరుగుతుంది. దానికి ముందు నుంచి కూడా మెగా అభిమానుల నుంచి నాకు సపోర్ట్ గా ఉన్నారు. కానీ ఈ రోజు నాకు తెలియకుండా ఒక 30 మినిట్స్ నుంచి మెగా అభిమానుల వైపు నుంచి కూడా ట్రోల్ జరుగుతున్నట్టు తెలిసింది.

ఎప్పుడో 2011లో ఫేస్ బుక్లో ఒక పోస్ట్ పెట్టానని ట్రోల్ చేస్తున్నారు. అది నేను పెట్టిన పోస్ట్ కాదు.. ఏదో జరిగింది.. హ్యాక్ అయి ఉంటుంది. నేను అందరు హీరోలతో పని చేశాను.. ఎక్కువ పని చేసింది మెగా హీరోలతోనే. మెగా హీరోలు అందరితోనూ నాకు సానిహిత్యం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమాకు నేను పని చేశాను. అప్పుడు నన్ను కళ్యాణ్ గారు బాగా సపోర్ట్ చేశారు. అదే సమయంలో సాయి ధరమ్ తేజ్ గారిని కూడా పరిచయం చేసి మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకో అన్నారు. తేజ్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నన్ను అన్నా అన్నా అని సంబోధిస్తారు. అలాంటిది నేను మెగా అభిమానులను ఎందుకు దూరం చేసుకుంటానండి.

అందరిలాగే నేను కూడా చిరంజీవి గారి సినిమాలు చూసి, పవర్ స్టార్ గారి సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చాను డైరెక్టర్ అవుదామని..! అటువంటిది నేనెందుకు వాళ్లను దూరం చేసుకుంటాను.. అలాంటి తప్పు ఎందుకు చేస్తాను..? నా సోషల్ మీడియా పేజీలో పోస్ట్ అయింది.. తెలిసో తెలియకో జరిగింది.. అది హ్యాక్ అయింది.. అయినా కూడా నా సోషల్ మీడియా పేజీ కాబట్టి బాధ్యత తీసుకుంటున్నాను. ఇంకొకసారి ఇలాంటివి రాకుండా చూసుకుంటాను.. ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాను.

ఎందుకంటే ఒక పక్కన నా సినిమాపై ట్రోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు.. కాబట్టి ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగదు.. దానికి నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగవు మెగా అభిమానులు అందరికీ.. మీలో ఒకడిగా నేను హామీ ఇస్తూ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను" అని మెగా ఫ్యాన్స్ కు క్షమాపణ చెప్పుకొచ్చాడు. 

అంతేకాకుండా ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సరిగ్గాఏడాదిక్రితం మన రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడం కోసం ఒకరు వచ్చారు’ అని భైరవం ట్రైలర్ ఈవెంట్‌లో విజయ్ పొలిటికల్‌ కామెంట్స్‌ చేశాడు. దీంతో YSRCP అభిమానులు కూడా విజయ్‌ కామెంట్స్‌పై ఫైర్ అవుతూ బాయ్‌కాట్ భైరవం అంటున్నారు. 

విజయ్ కనకమేడల సినిమాల విషయానికి వస్తే:

అల్లరినరేష్ తో నాంది మూవీ తెరకెక్కించి సూపర్ హిట్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత కాస్తా  గ్యాప్ తీసుకుని అల్లరి నరేష్ తో ఉగ్రం అనే మూవీ తీశాడు. ఇది యావరేజ్ హిట్ అనిపించుకుంది. ఇప్పుడు త‌మిళ ఇండస్ట్రీలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ‘గ‌రుడ‌న్’ రీమేక్‌ చేసి భైరవంతో వస్తున్నాడు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లు నటించారు. ఈ మూవీ మే30న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

నాంది సినిమాతో విభిన్నమైన డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న విజయ్ కనకమేడల.. ఇప్పుడు అనూహ్యంగా హాట్ టాపిక్ అయ్యాడు. మరి మెగా ఫ్యాన్స్ దెబ్బతో భైరవం ఎలాంటి అనుభవాన్ని రుచిచుస్తుందో తెలియాల్సి ఉంది. ఇకపోతే భైరవం మూవీని పెన్ స్టూడియోస్‌‌ డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌‌ పతాకంపై కెకె రాధామోహన్‌‌ నిర్మించారు.