జనవరిలో మన వ్యాక్సిన్!

జనవరిలో మన వ్యాక్సిన్!
  • దేశంలోని 12 మెడికల్ ఇనిస్టిట్యూట్ లలో ట్రయల్స్
  • ఈ మధ్యే ఫేజ్3 ట్రయల్స్ స్టార్ట్ చేసిన సీరమ్
  •  ఇనిస్టిట్యూట్ డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ తేవాలన్న పట్టుదలతో కేంద్రం

వ్యాక్సిన్ తయారీ రేసులో మన దేశమూ ముందు వరుసలో ఉంది. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కొవ్యాగ్జిన్   అనే తొలి దేశీ కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తోంది. ఈ ఇనాక్వేటెడ్  వైరస్ వ్యాక్సిన్ ను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఆ వ్యాక్సిన్ ఫేజ్2 ట్రయల్స్ జరుగుతున్నాయి . హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాల్లో ట్రయల్స్ చేస్తున్నారు. త్వరలోనే ఫేజ్3 ట్ర యల్స్ మొదలు కాబోతున్నాయి. ఆగస్టు15 నాటికే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని మొదట్లో ఐసీఎంఆర్ ప్రకటించింది. దానిపై విమర్శలు వచ్చినా మన సైంటిస్టులపై అనుమానాలు పెట్టుకోవద్దని, వీలైనంత తొందరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని వివరణ ఇచ్చింది. అయితే, అన్ని ట్రయల్స్ అయిపోయాక సేఫ్ అనుకున్నాకే వ్యాక్సిన్ను తీసుకొస్తామని భారత్ బయోటెక్కూడా ప్రకటించింది. మరో కంపెనీ జైడస్ క్యాడిలా కూడా జైకోవీ–డీ అనే వ్యాక్సిన్ ను డెవలప్చేస్తోంది. ఐసీఎంఆర్ సహకారంతో ఆ వ్యాక్సిన్పైనా ఫేజ్2 ట్రయల్స్ జరుగుతున్నాయి . డీఎన్ఏ రీకాంబినెంట్ టెక్నాలజీతో వ్యాక్సిన్ను తయారు చేసింది కంపెనీ. ఈ రెండు వ్యాక్సిన్లపై ట్రయల్స్ చేసేందుకు దేశంలోని 12 మెడికల్ ఇనిస్టిట్యూట్ లను ఐసీఎంఆర్ ఎంపిక చేసింది. వచ్చేఏడాది ప్రారంభంలో మన వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చేఅవకాశాలు కనిపిస్తున్నాయి.

మనకు వచ్చే ఏడాదే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్

ఆక్స్ఫర్డ్ తయారు చేస్తున్న చేడాక్స్ 1ఎన్కోవ్19 అనే వ్యాక్సిన్ 2021లో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ను పెద్ద సంఖ్యలో తయారు చేసేందుకు ఆక్స్ ఫర్డ్వవర్సిటీతో పాటు ఆస్ట్రాజెనెకా కంపెనీతో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒప్పందం చేసుకుంది. కొవిషీల్డ్పేరుతో మార్కెట్ చేయబోతున్న వ్యాక్సిన్ పై మన దేశంలో కొద్ది రోజుల క్రితమే ఫేజ్2/ఫేజ్3 కంబైన్డ్ట్ర్ ట్రయల్స మొదలయ్యాయి. 17 ప్రాంతాల్లో 1,600 మందిపై ట్రయల్స్ చేస్తున్నారు. అందులో ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఐదుగురికి వ్యాక్సిన్ ను ఇచ్చారు. అయితే, ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. వచ్చే ఏడాది మొదటి మూడు నెలల్లో వ్యాక్సిన్ ను రిలీజ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

కేంద్ర సర్కార్ రివ్యూ

డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ను తీసుకురావాలన్న పట్టుదలతో ఉంది మన ప్రభుత్వం. అందులో భాగంగా వ్యాక్సిన్ల ట్రయల్స్పై కేంద్ర ప్రభుత్వం శనివారం సమీక్ష నిర్వహించింది. వ్యాక్సిన్ల సేకరణ, ముందు ఎవరికివ్వాలన్న దానిపై కరోనా వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్పై వేసిన నేషనల్ ఎక్స్ పర్ట్ గ్రూప్తో సమావేశమైంది. వ్యాక్సిన్ లబ్ధిదారుల ఎంపికను జాగ్రత్తగా చేపట్టాల్సిన విషయాలపై చర్చించింది. అంతేగాకుండా వ్యాక్సిన్ల రవాణా, స్టోరేజీ, డిజిటల్ సిస్టమ్ల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యల విషయమూ ప్రస్తావనకు వచ్చింది.