మహాలయపక్షాలు 2025: పితృదోషం సంకేతాలు ఇవే.. నివారణకు ఏం చేయాలి..!

మహాలయపక్షాలు 2025: పితృదోషం సంకేతాలు  ఇవే.. నివారణకు ఏం చేయాలి..!

పితృ దోషం ఉంటే ఏ పని చేసినా కలసి రాదు.. ఆరోగ్య సమస్యలు.. ఆర్థిక సమస్యలు.. అన్ని రకాలుగా ఇబ్బందులు వేధిస్తూ ఉంటాయి.  పితృదోషం నివారణకు మహాలయ పక్షాల్లోకొన్ని పద్దతులను పాటించాలని పండితులు చెబుతున్నారు.  అసలు పితృదోషం ఉంటే ఎలాంటిసంకేతాలు ఉంటాయి.. వాటి నివారణకు పురాణాల ప్రకారం పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. . 

పితృ పక్షం.. మహాలయ పక్షాలు కొనసాగుతున్నాయి.  పితృ దేవతలను అర్చించేందుకు.. వారి ఆశీస్సులు లను పొందేందుకు  .. పితృ దేవతలు  ఈ నెల 21 వ తేది వరకు అంటే బాధ్రపదమాసం అమావాస్య  వరకు భూమిపై సంచరిస్తారు.  బాధ్రపదమాసం చివరి 15 రోజులు అంటే కృష్ఫ పక్షంలో పితృదేవతలను సంతృప్తి  పరచాలని పండితులు చెబుతున్నారు. 

ALSO READ :  పితృ దోషం ఎన్ని తరాలు వెంటాడుతుంది..

పూర్వీకులు అసంతృప్తితో ఉంటే వారి వారసులు అనేక ఇబ్బందులు పడతారట. ఆర్థిక సంక్షోభం.. ఆరోగ్య సమస్యలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు.  పూర్వీకులను సంతృప్తి చెందితే.. ఈతి భాధలు.. ఆర్థిక బాధల నుంచి.. ఆర్థిక బాధల నుంచి విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

ఒక్కోసారి .. పూర్వీకులకు ఆబ్దికాలు నిర్వహించడం సాధ్యపడకపోవచ్చు.  అలాంటి  సమయంలో వారి ఆకలి తీరక వారసులకు శాపం పెడతారు.  అలాంటి వారు పితృ పక్షాల్లో అంటే బాధ్రపద మాసం కృష్ణ పక్షంలో పూర్వీకులకు శ్రాద్దం.. పిండ ప్రదానం.. తర్పణాలు వదలాలని పండితులు చెబుతున్నారు. 

తండ్రి అసంతృప్తికి సాధారణ సంకేతాలు

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు.   ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ ఉండదు.  ఎప్పుడూ ఏదో అనవసరమైన తప్పని ఖర్చులు వెంటాడుతుంటాయి.  అప్పులు పెరగుతాయి. లక్షల రూపాయిలు ఆదాయం ఉన్నా.. పది రూపాయిలు సేవింగ్స్​ చేయలేరు.  అంతే కాదు వివాహం విషయంలో చాలా సమస్యలు వెంటాడుతాయి.  సంబంధాలు నిశ్చయమైనట్లే అయి ఆగిపోతాయి.  ప్రతి విషయంలో ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి. 

కొంతమంది ఎప్పుడూ అనారోగ్యానికి గురవుతుంటారు.  దీర్ఘకాలిక రోగాలు వేధిస్తుంటాయి.  ఏ విషయంపై శ్రద్ద పెట్టలేకపోతారు.  ప్రతి పని విషయంలో కూడా ఆటంకాలు ఏర్పడుతాయి.  ఇలాంటి సంకేతాలు జీవితంలో తరచూ సంభవిస్తుంటే.. అలాంటి వారికి  పూర్వీకుల శాపం ఉందని పండితులు చెబుతున్నారు. 


పితృ దోషం నుంచి ఎలా తప్పించుకోవాలి...

పూర్వీకులు మరణించిన తిథి రోజు కచ్చితంగా శ్రాద్ద కర్మలు నిర్వహించాలి.  పితృపక్షాలసమయంలో పెద్దలకు..ఆహారం.. నీరు..నువ్వులతో .. తర్పణాలు వదలాలి.  పూర్వీకులను అర్చించాలి.  బ్రాహ్మణులకు స్వయం పాకం .. దక్షిణ.. వస్త్రదానం చేయాలి.  పేదలకు, పేదలకు ఆహారం, బట్టలు, ధాన్యాలు, డబ్బు..  దానం చేయాలి.  ఇలా చేయడం వలన పూర్వీకుల ఆత్మ శాంతిస్తుంది.