చిన్నారులపై క్లినికల్‌ ట్రయల్స్‌కు భారత్‌ బయోటెక్‌కు గ్రీన్‌ సిగ్నల్

చిన్నారులపై క్లినికల్‌ ట్రయల్స్‌కు భారత్‌ బయోటెక్‌కు గ్రీన్‌ సిగ్నల్

దేశంలో 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకాలు వేసేందుకు అనుమతించింది కేంద్రప్రభుత్వం. దీంతో చిన్నారులపై క్లినికల్‌ ట్రయల్స్‌ ఫేజ్‌ 2, ఫేజ్‌ 3 నిర్వహించేందుకు భారత్‌ బయోటెక్‌కు నిపుణుల ప్యానెల్‌ గ్రీన్ సిగ్నలిచ్చింది. కోవాగ్జిన్‌ టీకా వివరాలను పంపాలని సిఫార్సు చేసింది. ఒక వేళ ఇది ఆమోదం పొందితే... పెద్ద మొత్తంలో యువత టీకాలు వినియోగించుకునే అవకాశముంటుంది. అదేవిధంగా స్కూళ్లు తిరిగి తెరుకున్న తర్వాత.. తరగతులకు విద్యార్థులు స్వేచ్ఛగా హాజరు కావచ్చు. 

2 నుండి 18  ఇయర్స్ వయస్సు పిల్లలపై ఫేజ్‌- 2, ఫేజ్‌- 3 క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు అనుమతి కోరుతూ హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సమర్పించిన దరఖాస్తుపై సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (CDSCO) లోని కొవిడ్‌-19పై సబ్జెక్‌ ఎక్స్‌ఫర్డ్‌ కమిటీ (SEC) చర్చించింది. ఢిల్లీ ఎయిమ్స్‌, పాట్నా ఎయిమ్స్‌, నాగ్‌పూర్‌లోని మెడిట్రినా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో 525 సబ్జెక్టులపై పరీక్షలు చేపట్టనుంది. చర్చల తర్వాత రెండు దశల ట్రయల్స్‌కు కోవాగ్జిన్‌కు నిపుణుల కమిటీ గ్రీన్‌ సిగ్నల్  ఇచ్చింది.