UNHRCలో పాకిస్తాన్ కు భారత్ కౌంటర్

UNHRCలో పాకిస్తాన్ కు భారత్ కౌంటర్

ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘంలో పాకిస్తాన్ కు అడ్డుకట్ట వేసింది భారత్. కశ్మీర్ లో మానవ హక్కులను అణచివేస్తున్నారని కల్పిత ఆరోపణలను కొట్టిపారేసింది. జమ్మూకశ్మీర్ కే చెందిన భారత దౌత్యవేత్త విమర్ష్ ఆర్యన్ పాకిస్తాన్ ఆరోపణలకు పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చారు. UNHRCలో భారత శాశ్వత మిషన్ కు ఫస్ట్ సెక్రటరీగా ఉన్నారు విమర్ష్ ఆర్యన్. ఆర్టికల్ 370 భారత రాజ్యాంగంలో తాత్కాలికంగా ఏర్పాటు చేయబడ్డ ప్రొవిజన్ మాత్రమేనని స్పష్టం చేశారు. దాంట్లో  ఎలాంటి మార్పులు చేసినా…అది తమ సార్వభౌమ హక్కు అని స్పష్టం చేశారు. కొందరు పాకిస్తానీ నాయకులు జమ్మూకశ్మీర్ లో హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. పాకిస్తాన్ లో మైనారిటీల జరుగుతున్న దాడుల సంగతేంటని ప్రశ్నించారు.