హైదరాబాద్ గచ్చిబౌలిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 80 మేనేజ్‌మెంట్ ట్రైనీ.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ 32, మెకానికల్ 27, ఎలక్ట్రికల్ 06, కంప్యూటర్ సైన్స్ 04, మెటలర్జీ 01, కెమికల్ 01, సివిల్ 02, ఫైనాన్స్ 05, హ్యూమన్ రిసోర్స్ 02.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో ఫస్ట్‌క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ లేదా ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు లేదా సమాన అర్హత ఉండాలి. సీఏ / ఐసీడబ్ల్యూఏఐ/ ఫస్ట్‌క్లాస్ ఎంబీఏ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి (25-11-2025 నాటికి): 27 ఏండ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: డిసెంబర్ 29.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: ఈ పరీక్షలో మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. సంబంధిత సబ్జెక్ట్ నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు, జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు ఇస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉన్నది. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
వెయిటేజ్: కంప్యూటర్ బేస్డ్ టెస్టుకు 85 శాతం.ఇంటర్వ్యూకు 15 శాతం ఉంటుంది.
కనీస అర్హత: అన్రిజర్వ్డ్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీలకు 50 శాతం సాధించాల్సి ఉంటుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: 2026, జనవరి 11.
పూర్తి వివరాలకు bdl-india.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
