భారత్ జోడో న్యాయ్ యాత్ర అసలు ఉద్దేశం ఇదే..

భారత్ జోడో న్యాయ్ యాత్ర అసలు ఉద్దేశం ఇదే..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర అసోంలో కొనసాగుతోంది. అసోంలో రాహుల్ యాత్రకు విశేష ఆదరణ వస్తోంది. అయితే అక్కడి హిమంత బిశ్వ శర్మ సర్కార్ రాహుల్ యాత్రకు అడుగుడున అడ్డంకులు సృష్టిస్తోంది. రాహుల్ యాత్ర కాన్వాయ్ పై  దాడికి దిగడం, రాహుల్ ను నిన్న గుడిలోకి వెళ్లనివ్వకపోవడం..ఇవాళ వర్శిటీ విద్యార్థులను కలవకుండా అడ్డుకోవడం ఇలా రోజుకో అడ్డంకి సృష్టిస్తున్నారు. అయినా బీజేపీ కుట్రలకు భయపడకుండా రాహుల్ తన యాత్రను ముందుకు కొనసాగిస్తున్నారు.

అయితే భారత్ జోడో న్యాయ్ యాత్ర వెనక ఉన్న అసలు ఉద్దేశం  రాహుల్ వెల్లడించారు.  న్యాయ్ యాత్ర వెనుక ఉన్న ఆలోచన న్యాయం అని..దీనికి ఐదు లక్షణాలు(పంచ్ న్యాయ్) ఉన్నాయన్నారు.

1) యువతకు న్యాయం
2) ప్రాతినిథ్య న్యాయం
 3)మహిళలకు న్యాయం
 4) రైతులకు న్యాయం
5)కార్మికులకు న్యాయం

 వీటి సాధన కోసం కాంగ్రెస్ పార్టీ నెల రోజుల్లో కొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తుందని చెప్పారు రాహుల్ గాంధీ.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు హేమంత్ సర్కార్ అడుగడుగున అడ్డుకుంటోంది.   జనవరి 23వ తేదీ మంగళవారం రాజధాని గౌహతి సమీపంలోని ఖానాపరాలో భారత్ జోడో యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు కాంగ్రెస్ శ్రేణులపై లాఠీ చార్చ్ చేశారు.  వర్శిటీ బయటే మాట్లాడిన రాహుల్  తాను విద్యార్థులను కలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన  ఇబ్బందులేంటని  ప్రశ్నించారు.