రాహుల్ గాంధీపై కేసు నమోదు

రాహుల్ గాంధీపై కేసు నమోదు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అసోం ప్రభుత్వం కేసు నమోదు చేసింది. రాహుల్ గాంధీతో పాటు  కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్‌లపై  ప్రభుత్వం పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. హింసాత్మక చర్యలు ప్రజల్ని రెచ్చగొట్టడం, పబ్లిక్ ప్రాపర్టీలకు నష్టం చేకూర్చడం, పోలీసులపై దాడి చేసినందుకు వీరిపై కేసు నమోదు చేసినట్లు  అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తన ట్విట్టర్లో తెలిపారు.  సెక్షన్ 120(బి)143/147 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందని వెల్లడించారు. 

అంతకుముందు కాంగ్రెస్ నేత  రాహుల్ గాంధీపై కేసు పెట్టాలని డీజీపీకి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదేశాలు జారీ చేశారు.   రాహుల్   అసోం ప్రజలను  రెచ్చగొడుతూ యాత్ర చేస్తున్నారని ఆరోపించారు.  రాహుల్ యాత్ర నక్సల్స్ పంథాలో నడుస్తోందని.. ఇది అసోంకు ఎట్టిపరిస్థితుల్లో  మంచిది కాదన్నారు. 

అయితే సీఎం బెదిరింపులకు భయపడేది లేదని రాహుల్ గాంధీ కౌంటర్ వేశారు.  తానంటే హిమంత బిశ్వ శర్మకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ దేశంలోనే అత్యంత అవినీతిపరులైన ముఖ్యమంత్రులలో  ఒకరని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ అన్నారు. తన యాత్రకు బీజేపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. తనను ఎంత ఇబ్బంది పెడితే అంత మంచి జరుగుతుందన్నారు.  తనను కావాలనే కాలేజీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని అన్నారు. బీజేపీ తీరును యావత్ దేశం గమనిస్తోందన్నారు.