కర్ణాటకలో భారత్ జోడో యాత్ర

కర్ణాటకలో భారత్ జోడో యాత్ర

రాహుల్ గాంధీ  చేపట్టిన భారత్ జోడో యాత్ర 32వ రోజు కొనసాగుతోంది. రాహుల్ యాత్ర కర్ణాటకలోని తూమ్కూర్ జిల్లాలో నుంచి కంటిన్యూ అవుతోంది. ఇవాళ పోచ్ కట్టె గ్రామంలో రాహుల్ పాదయాత్ర  ప్రారంభించారు. పాద యాత్రలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామంలో పర్యటిస్తున్న  రాహుల్ గాంధీ.. స్థానికుల సమస్యలు తెలుకుంటున్నారు. దేశాన్ని ఐక్యంగా ఉంచే యాత్రలో ప్రతి ఒక్కరు  పాల్గోవాలని రాహుల్ పిలుపునిచ్చారు.

సెప్టెంబర్‌ 7న తమిళనాడు కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ భారత్‌ జోడో యాత్ర.. తమిళనాడు, కేరళల మీదుగా కర్ణాటకలో ప్రవేశించింది.150 రోజుల పాటు దాదాపు 12 రాష్ట్రాల మీదుగా జమ్ము కశ్మీర్‌ వరకు భారత్‌ జోడో యాత్ర సాగనుంది. మొత్తం 3 వేల 500 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర చేయనున్నారు.