బాల్క సుమన్ ను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలి : మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ బండి సదానందం యాదవ్

బాల్క సుమన్ ను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలి : మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ బండి సదానందం యాదవ్

కోల్​బెల్ట్​/చెన్నూరు, వెలుగు:  తెలంగాణ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్​ నేత, అఖిల భారత యాదవ సంఘం మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్​ బండి సదానందం యాదవ్​ డిమాండ్​  చేవారు.   మందమర్రిలో రెండు నెలల పాటు మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి-కళావతి స్మారకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రం ముగింపు కార్యక్రమంలో  ఆయన మాట్లాడారు.  బాల్క సుమన్​  వ్యాఖ్యలు తీవ్రవాదాన్ని, గుండాయిజాన్నీ పెంచేలా  ఉన్నాయన్నారు.    కార్యక్రమంలో  కాంగ్రెస్​ టౌన్​ ప్రెసిడెంట్​ మంద తిరుమల్​రెడ్డి, జిల్లా జనరల్​ సెక్రటరీ పుల్లూరి లక్ష్మణ్​ మాట్లాడారు.   

అలాగే..  బాల్క సుమన్ ను అరెస్ట్ చేయడం అక్రమమని  బీ ఆర్ ఎస్ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదం అని  డీసీసీ  సీక్రటరీలు చెన్న సూర్యనారాయణ,చింతలశ్రీనివాస్ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బాల్క సుమన్ మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని రెచ్చగొట్టేలా చట్టవ్యతిరేక వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.  ఈ కార్యక్రమంలో రాయబారపు కిరణ్​, రాచర్ల గణేశ్​,పెద్దింటి శ్రీనివాస్, సుశీల్ కుమారు, పాతర్ల నాగరాజు, లింగంపల్లి మహేశ్​ పాల్గొన్నారు.