బీఆర్ఓకు భారతరత్న ఇవ్వొచ్చు

బీఆర్ఓకు భారతరత్న ఇవ్వొచ్చు

సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణాలు చేపట్టే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ)ను అభినందనల్లో ముంచెత్తారు ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా. వ్యక్తులకు మాత్రమే ఇస్తూ వస్తున్న భారతరత్న పురస్కారాన్ని సంస్థలకు కూడా ఇచ్చేట్టయితే బీఆర్ఓకు కూడా భారతరత్న ఇవ్వాలన్నారు.

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో ఓ సొరంగ మార్గం నిర్మించింది. సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో 9.2 కిలోమీటర్ల పొడవున్న ఈ టన్నెల్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగమార్గం. అటల్ టన్నెల్ పేరుతో ఈ సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ(శనివారం) ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా బీఆర్ఓ ప్రశంసిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. సంస్థలకు భారతరత్న ఇస్తారో లేదో తనకు తెలియదని.. కానీ ఎంతో తెగువ, కష్టించే స్వభావంతో పనిచేసే బీఆర్ఓకు మాత్రం అందుకు అన్నివిధాలా అర్హత ఉందన్నారు  ఆనంద్ మహీంద్రా.