భారతరత్న అవార్డు గ్రహీత ప్రొఫెసర్ CNR రావును అంతర్జాతీయ పురస్కారం వరించింది. రసాయన శాస్త్రంలో లెజెండరీ సైంటిస్ట్‌గా ఉన్న ఆయనకు పునరుత్పాదక ఇంధన వనరులపై చేసిన పరిశోధనలకు గాను ఇంటర్నేషనల్ ఎనీ అవార్డు- 2020 దక్కింది. ఎనర్జీ రీసెర్చిలో ఈ అవార్డును నోబెల్ బహుమతిగా గుర్తిస్తారట. ఈ అవార్డును ఆయనకు అక్టోబర్ 14న రోమ్‌లోని క్విరినల్ ప్యాలస్‌లో నిర్వహించే అధికారిక కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాటారెల్లా హాజరు కానున్నారు. ఈ పురస్కారం కింద నగదు బహుమతితో పాటు గోల్డ్ మెడల్ ను అందజేయనున్నారు.
