భారత ​జాగృతి ఆధ్వర్యంలో.. బతుకమ్మ పాటల సేకరణ

భారత ​జాగృతి ఆధ్వర్యంలో.. బతుకమ్మ పాటల సేకరణ

హైదరాబాద్, వెలుగు : బతుకమ్మ పాటల సేకరణకు భారత​జాగృతి శ్రీకారం చుట్టింది.  జాగృతి యాప్​లో ఇప్పటికే150 బతుకమ్మ పాటలు ఉన్నాయని భారత​జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తెలిపారు.  ప్రజల సహకారంతో అరుదైన, ప్రాచీన, కొత్తగా వచ్చిన బతుకమ్మ పాటలను సేకరిస్తున్నామని ఆమె వెల్లడించారు.  సోమవారం కవిత తన నివాసంలో ప్రముఖ గాయకులు తేలు విజయ, పద్మావతి, మౌనిక యాదవ్, సౌమ్య, భారత జాగృతి సాంస్కృతిక విభాగం కన్వీనర్​కొడారి శ్రీనుతో కలిసి బతుకమ్మ పాటలు పాడారు. 

ఆ వీడియోను ఎక్స్​లో పోస్ట్​చేశారు. ప్రజలు సేకరించిన బతుకమ్మ పాటలను +91 89856 99999 నెంబర్ కి వాట్సాప్ ద్వారా పంపాలని ఆమె విజ్ఞప్తి చేశారు.  ప్రజలు తమకు ఇష్టమైన బతుకమ్మ పాటలను సోషల్​మీడియా భారత జాగృతికి ట్యాగ్ చేస్తూ పోస్టు చేయాలని, తెలంగాణ జాగృతి యాప్ ద్వారా షేర్ చేయాలని కవిత పిలుపునిచ్చారు.