ఎపియోన్ హాస్పిటల్ కు అవార్డు

ఎపియోన్ హాస్పిటల్ కు అవార్డు

హైదరాబాద్, వెలుగు: మోకాలి కీళ్ల ఆస్టియో అర్ధరైటిస్ నొప్పుల నివారణలో అందిస్తున్న సేవలకు గాను ఎపియోన్ హాస్పిటల్ భారతీయ సేవా రత్న అవార్డుని సొంతం చేసుకుంది. దక్షిణ భారతదేశంలో మోకాలి కీళ్ల ఆస్టియో అర్ధరైటిస్ కు ఎక్కువ సంఖ్యలో నాన్ సర్జికల్ ప్లాస్మా థెరపీలను చేసినందుకు ఎపియోన్ హాస్పిటల్ కు గ్లోబల్ ఫౌండేషన్ ఈ  అవార్డును ఎపియోన్ హాస్పిటల్ కు అందజేసింది.  

ఇటీవల 2022లో సంబంధిత రంగంలోని ప్రముఖులకు గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా భారత సేవారత్న అవార్డు అందించారు. పెయిన్ మెడిసిన్ రంగంలో విస్తృతమైన కృషికి పద్మశ్రీ డాక్టర్ పద్మజా రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును డా. సుధీర్ దారా అందుకున్నారు. ఈ అవార్డుతో తమ బాధ్యత మరింత పెరిగిందని, పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు.