
మహారాష్ట్ర నాగ్ పూర్ లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం, విజయ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ తో పాటు గోల్వాల్కర్ కు నివాళులర్పించారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఆ తర్వాత ఆయధ పూజ చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆయుధాలతో నిర్వహించిన పరేడ్ ఆకట్టుకుంది. భారతదేశ చరిత్రను, సంస్కృతి, సంప్రదాయాలను నాశనం చేసే కుట్ర జరుగుతోందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. స్వాధీనత నుంచి స్వతంత్రత వరకు ఆర్ఎస్ఎస్ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదన్నారు. దేశవిభజన విచారకరమైన చరిత్ర అని చెప్పారు. దేశ సమగ్రత, ఐక్యతను తిరిగి తీసుకురావడానికి కొత్త తరం కృషి చేయాలన్నారు మోహన్ భగవత్.