ఎయిర్​టెల్​లో భారతీ టెలికామ్​ వాటా పెంపు

ఎయిర్​టెల్​లో భారతీ టెలికామ్​ వాటా పెంపు

న్యూఢిల్లీ :   భారతీ ఎయిర్‌‌టెల్​లో  ప్రమోటర్ సంస్థ అయిన భారతి టెలికాం  అదనంగా 1.35 శాతం వాటాను రూ. 8,301 కోట్లకు బహిరంగ మార్కెట్ లావాదేవీ ద్వారా కొనుగోలు చేసింది. దీనితో, భారతీ ఎయిర్‌‌టెల్‌‌లో భారతి టెలికాం  ప్రత్యక్ష వాటా 38.35 శాతం వాటా నుంచి 39.7 శాతానికి చేరుకుంటుంది. సునీల్ భారతి మిట్టల్ కుటుంబం  సింగపూర్‌‌కు చెందిన సింగ్‌‌టెల్ సహ-యాజమాన్యం కలిగిన భారతి టెలికాం సెప్టెంబర్ 30 నాటికి భారతీ ఎయిర్‌‌టెల్‌‌లో 38.35 శాతం వాటాను కలిగి ఉంది.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌‌లో బ్లాక్ డీల్ మెకానిజం ద్వారా ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్‌‌మెంట్ లిమిటెడ్  నుంచి భారతీ టెలికాం లిమిటెడ్  భారతీ ఎయిర్‌‌టెల్ లిమిటెడ్  1.35 శాతం షేర్లను మొత్తం రూ. 8,301.73 కోట్లకు కొనుగోలు చేసిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో కంపెనీ తెలిపింది. సెప్టెంబర్ 30, 2023 నాటికి భారతీ ఎయిర్‌‌టెల్‌‌లో 5.93 శాతం వాటాను కలిగి ఉన్న ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీ ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్‌‌మెంట్ లిమిటెడ్ నుంచి కంపెనీ వాటాను పొందింది. సింగపూర్‌‌కు చెందిన సింగ్‌‌టెల్ భారతీ టెలికాంలో 50.56 శాతం వాటాను కలిగి ఉంది  సెప్టెంబర్ 30, 2022 నాటికి మిట్టల్ కుటుంబానికి 49.44 శాతం వాటా ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌‌లో అందుబాటులో ఉన్న బ్లాక్ డీల్ డేటా ప్రకారం భారతి టెలికాం 8.11 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. ఇది భారతీ ఎయిర్‌‌టెల్‌‌లో 1.35 శాతం వాటాకు సమానం.