
హైదరాబాద్ నిమ్స్ లో దీక్షను విరమించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క. పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, AICC నేతలు భట్టికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.
టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ ఈ నెల నుంచి 8 నుంచి హైద్రాబాద్ ఇందిరాపార్క్ దగ్గర దీక్షకు కూర్చుకున్నారు భట్టి. ఫిరాయింపుల చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఉదయం పోలీసులు భట్టి విక్రమార్కను దీక్షా స్థలం నుంచి బలవంతంగా అరెస్ట్ చేసి నిమ్స్ కు తరలించారు. ఫిరాయింపులపై చర్యలు తీసుకునేవరకు దీక్ష కొనసాగిస్తానంటూ నిమ్స్ లో చికిత్సకు సహకరించలేదు భట్టి.
రాహుల్ గాంధీ ఫోన్
నిమ్స్ లో చేరిన భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ప్రజా సమస్యలపై న్యాయపోరాటం కొనసాగించాలని సూచించారు. దీక్షను విరమించాలని కోరడంతో భట్టి అంగీకరించారు. పార్టీ ముఖ్య నేతలు, భట్టికి నచ్చచెప్పి దీక్ష విరమింపచేశారు.