సీఎల్పీ భేటీకి ముందే..డీకేతో సీనియర్ల స్పెషల్ మీటింగ్

సీఎల్పీ భేటీకి ముందే..డీకేతో సీనియర్ల స్పెషల్ మీటింగ్

గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ లో సీఎల్పీ సమావేశం ప్రారంభమయ్యింది.  సీఎల్పీ నేతను  ఎంపిక చేయనున్నారు. ఈ భేటీలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏఐసీసీ నేతలు ఉన్నారు. సీఎల్పీ నేతను ఏక వాఖ్య తీర్మానంతో ఎంపిక చేయనున్నారు. అయితే సీఎల్పీ భేటీ అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  గవర్నర్ తమళి సైని కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు.  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కాంగ్రెస్ ను ఆహ్వానించనున్నారు గవర్నర్. ఇవాళ సీఎం,డిప్యూటీ సీఎం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 

మరో వైపు సీఎల్పీ  సీఎల్పీ సమావేశానికి ముందు కాంగ్రెస్ సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహా, దుద్దిళ్ల శ్రీధర్ బాబు,  పార్క్ హయత్ హోటల్ లో   డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు.   రేవంత్ కు సీఎం పదవి ఇస్తారనే  ప్రచారంతోనే వీరంతా డీకేను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భేటీ అనంతరం వీరంతా సీఎల్పీ సమావేశం కోసం ఎల్లా హోటల్ కు బయల్దేరారు.  

119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 64 సీట్లు, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ ఒక సీట్లు గెలిచాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 60 సీట్ల కంటే కాంగ్రెస్ నాలుగు సీట్లు ఎక్కువగానే గెలుచుకుంది.