
హైదరాబాద్, వెలుగు: కర్నాటక సీఎం సిద్ధ రామయ్యతో కాంగ్రెస్ రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ తదితర నేతలు బుధవారం సిద్దరామయ్య నివాసంలో సమావేశమయ్యారు. సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహించనున్న బహిరంగ సభకు రావాలని సిద్ధ రామయ్యను నేతలు ఆహ్వానించారు. ఆ సభలోనే బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న సంగతి తెలిసిందే.
మీటింగుకు సిద్ధ రామయ్యను ఆహ్వానిస్తామని కాంగ్రెస్ నేతలు ముందే చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన్ను సభకు ఆహ్వానించేందుకు వారు వెళ్లారు. సభకు వస్తానని సిద్ధ రామయ్య భట్టి, మధుయాష్కీలకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. సీఎంతో భేటీ అయిన వారిలో ఏఐసీసీ రాష్ట్ర మాజీ ఇన్చార్జి బోసు రాజు కూడా ఉన్నారు.