నిన్న మోహదీపట్నం.. ఇవాళ అమీర్‌ పేట‌లో.. రోబో టెక్నాలజీతో డ్రైనేజీ పూడిక తొలగింపు

నిన్న మోహదీపట్నం.. ఇవాళ అమీర్‌ పేట‌లో.. రోబో టెక్నాలజీతో డ్రైనేజీ పూడిక తొలగింపు

హైదరాబాద్: టెక్నాలజీ పెరిగిన తర్వాత మనుషులకు సాధ్యం కానీ పనులు చాలా ఈజీ అవుతున్నాయి.హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో డ్రైనేజీల క్లీనింగ్ కు కొత్త టెక్నాలజీని వినియోగించడం ద్వారా పూడికతీత పనులను చాలా సులభంగా చేస్తున్నారు. మంగళవారం (సెప్టెంబర్ 9) నగరంలోని అమీర్ పేట్ లో డ్రైనేజీ తొలగింపుకు రోబో టెక్నాలజీని వినియోగించారు. గత వర్షాలకు కురుకుపోయిన అమీర్ పేట్ మెట్రో స్టేషన్ పరిధిలోని నాలాను రోబో టెక్నాలజీ ఉపయోగించి క్లీన్ చేశారు. 

గత భారీ వర్షాలకు మెట్రో స్టేషన్ పరిసరాలు నీట మునగడంతో ఆ ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జీహెచ్ ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్లు కొన్ని పూర్తిగా కొన్ని పాక్షికంగా బ్లాక్ అయినట్లు గుర్తించారు.  

మంగళవారం హైడ్రా, జీహెచ్ ఎంసీ సంయుక్తంగా నాలాల్లో పూడిక తొలగింపు పనులు ప్రారంభించారు. ఈ పనుల్లో రోబో టెక్నాలజీ తో ప్రధాన రహదారి కింద ఉన్న బాక్స్ డ్రైన్లలో పూడిక తొలగించారు. అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద పూడిక తొలగింపు పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. 

రోబో టెక్నాలజీతో సొరంగ మార్గాల్లో గట్టిపడ్డ పూడికను తొలగించడం చాలా సులభమని అదికారులు హైడ్రా కమిషనర రంగనాథ్ కి తెలిపారు. మెహిదీపట్నం ఎన్ఎండీసీ దగ్గర రోబో టెక్నాలజీతో విజయవంతంగా పూడిక తొలగించామని చెప్పారు అధికారులు. 

ఇదే విధానాన్ని అమీర్‌ పేటలో కూడా అమలు చేసి పూడిక పనులు త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. రోబో టెక్నాలజీతో ఐదు రోజుల్లో పూర్తవుతాయని చెబుతున్నారు అధికారులు.