జమ్మికుంట మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొత్త పత్తి రాక.. క్వింటాకు రూ.5,021

జమ్మికుంట మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొత్త పత్తి రాక.. క్వింటాకు రూ.5,021

జమ్మికుంట, వెలుగు: ఉత్తర తెలంగాణలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జమ్మికుంట పత్తి మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొత్త పత్తి రాక ప్రారంభమైంది. మంగళవారం ఇల్లందకుంట గ్రామానికి చెందిన దంచాని స్వామి రెండు బస్తాల కొత్త పత్తి తీసుకురాగా బహిరంగ వేలం ద్వారా క్వింటాకు రూ.5,021 చొప్పున కొనుగోలు చేశారు. విడి పత్తి క్వింటాకు గరిష్ఠ ధర రూ.7,400 పలికింది. 

మార్కెట్ కమిటీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వప్న మాట్లాడుతూ రైతులు నేరుగా పత్తిని మార్కెట్ యార్డ్ కు తీసుకురావాలని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి మల్లేశం, మార్కెట్ కమిటీ సభ్యులు, దాడ్వాయిల సంఘం అధ్యక్షుడు రాజేశ్వరరావు  పాల్గొన్నారు.